విజయవాడ: భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 27వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి. సమరం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెడ్‌క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాలు, వార్షిక నివేదిక, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. సొసైటీ జీవిత సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, అర్హులైన సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరై సమావేశ కార్యక్రమాల్లో పాల్గొనాలని డాక్టర్ జి. సమరం కోరారు.
