విజయవాడ: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందటం అభినందనీయమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అన్నారు. విజయవాడ బిఆర్టిఎస్ రోడ్ లోని సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం 31 డివిజన్ మధ్య కట్టకు చెందిన తాతపూడి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఉమా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఫిబ్రవరిలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కీబోర్డ్ సంగీత కార్యక్రమంలో వహించారని తెలిపారు. దీనిలో ప్రపంచంలో 22 దేశాలకు చెందిన సుమారు 2000 మంది కీబోర్డు వాయిద్య కారులు పాల్గొని గంటసేపు నిరంతరాయంగా వాయించి ప్రతిపారు. వీరిలో 777 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారన్నారు. దీనిలో ఒకే కుటుంబానికి చెందిన తాతపూడి ఆరాధన, అభిషేక్, జీవన్ జాయ్, వరలక్ష్మి స్థానం సంపాదించడం అరుదైన విషయం అని ఆయన కొనియాడారు. చిన్నతనం నుంచే పిల్లలను కళల వైపు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. తాతపూడి కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి మెడల్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, గొట్టముక్కల వెంకటేశ్వరరాజు, 31 డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, డివిజన్ ఇంచార్జ్ కరోనా వెంకటరమణ తదితర నేతలు పాల్గొన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ‘గిన్నిస్’లో స్థానం
