ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

తెలుగు వేవ్ లోగో

* 10,119 మంది అభ్యర్థులకు గాను పేవర్-1కు 6,137 మంది, పేవర్-2కు 6,073 మంది హాజరు..
* పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, వాకాటి కరుణ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని విజయవాడలో 23 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా… సీనియర్ ఐఏఎస్ అధికారులు, పరీక్ష అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, వాకాటి కరుణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. యూపీఎస్సీ ఇన్‌స్పెక్టింగ్ అధికారులు హ‌ర్వేష్ కుమార్‌, సునీల్ కుమార్‌ లు పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగస్వాములయ్యారు.
10,119 మంది అభ్యర్థులకుగాను గాను ఉదయం పేపర్-1కు 6,137 (60.65 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్-2కు 6,073 (60.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. విజయవాడలో 23 పరీక్షా కేంద్రాలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్ష నిర్వహణను అధికారులు పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి లోక‌ల్ ఇన్‌స్పెక్టింగ్ క‌మ్ లైజ‌న్ ఆఫీస‌ర్‌, రూట్ అధికారులు, సూప‌ర్‌వైజ‌ర్లు, స్ట్రాంగ్ రూమ్ భ‌ద్ర‌తా సిబ్బంది త‌దిత‌రులు సమస్వయంతో పనిచేసి జిల్లాలో పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరి పరీక్ష ముగిసింది.