జూన్ 1నుంచి ధరల పెంపుపై నిరసన 

cpi

సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశం కేంద్ర ప్రభుత్వ పెట్రోల్,డీజిల్ ధరలను ఇప్పటికీ నాలుగు సార్లు పెంచడాన్ని తీవ్రంగా ఖండించింది. మళ్ళీ ధరలను పెంచబోతున్నట్టు వచ్చిన వార్తల పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరల పెరుగుదలను నిరసిస్తూ జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సుల రూపంలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది..

ఈ విస్తృత ప్రచార అనంతరం జూన్ 9వ,తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలియజేయడం జరుగుతుంది..కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాసర్లపూడి ప్రాంతాన్ని వామపక్షాల బృందం జూన్ మొదటి వారంలో పర్యటిస్తుంది.

డిమాండ్లు

  • పెట్రోలు,డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి
  • కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ లో 50% శాతం రాష్ట్రానికి కేటాయించాలి.
  • రష్యా, ఇరాన్ నుంచి  ఆయిల్ గ్యాస్ కొనుగోలును కొనసాగించాలి
  • కమర్షియల్ గ్యాస్ ను పాత ధరలకే ఇవ్వాలి

ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు(సిపిఎం), హరినాథ్ రెడ్డి(సిపిఐ), చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పొలారి(సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరినాథ్(సిపిఎంఎల్ లిబరేషన్), గణేష్ బాబు ఎంసిపిఐ(యు) పాల్గొన్నారు.. ఆర్.ఎస్.పి, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ,ఎస్ యుసిఐ(సి)పార్టీలు సమావేశ నిర్ణయాలకు తమ పూర్తి మద్దతును తెలియజేశాయి.