​పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో నిరాశ!

Indian passportt

​భారత్‌కు 125వ ర్యాంకు!

గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 నివేదిక విడుదలయ్యింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ స్వల్పంగా వెనుకబడింది. అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యం, ముందస్తు వీసా లేని ప్రయాణాలు, వీసా-ఆన్-అరైవల్ వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్‌కు ఈసారి నిరాశే మిగిలింది.

​125వ స్థానానికి భారత్.. టాప్-100 ఆశలు అగమ్యగోచరం!

​గత ఏడాది (2025) 124వ స్థానంలో నిలిచిన భారత పాస్‌పోర్ట్, ఈ ఏడాది ఒక స్థానం దిగజారి 125వ ర్యాంకుకు చేరుకుంది. 2021లో 127వ ర్యాంకులో ఉన్న భారతదేశం ఆ తర్వాత కొన్నేళ్లపాటు క్రమంగా కోలుకుంటూ వచ్చినప్పటికీ, ప్రపంచంలోని టాప్-100 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలోకి మాత్రం ఇంకా అడుగుపెట్టలేకపోయింది.

​భారతీయులకు వీసా ఫ్రీ ప్రయాణాలు ఎక్కడెక్కడ?

​తాజా గణాంకాల ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 26 దేశాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండా లేదా ‘వీసా-ఆన్-అరైవల్’ సౌకర్యంతో వెళ్లవచ్చు. ఈ దేశాల జాబితాలో ముఖ్యంగా ​భూటాన్, నేపాల్, జమైకా, మకావు, ట్యునీషియా ఉన్నాయి.

​ముందస్తు వీసా తప్పనిసరి: అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యూఏఈతో సహా ప్రపంచంలోని దాదాపు 88 ప్రముఖ దేశాలకు ప్రయాణించాలంటే భారతీయులు ఖచ్చితంగా ముందస్తు వీసా తీసుకోవాల్సిందే.

​పొరుగు దేశాలతో పోలిస్తే మెరుగే.. కానీ కొన్ని చిన్న దేశాల కంటే వెనుకే. దక్షిణాసియా ప్రాంతంలోని ఇతర పొరుగు దేశాలతో పోల్చి చూస్తే భారత్ పరిస్థితి కొంతవరకు నయమనే చెప్పాలి.