ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా జర్మనీ స్టార్ అలెగ్జాండర్

TENNIS

ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ నిలిచి తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ మూడో ర్యాంకర్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 5-7, 6-1 తో ప్రపంచ 14వ ర్యాంకర్ పదో సీడ్ ఫ్లావ్యూ కొబోలి (ఇటలీ ) పై గెలిచాడు. నాలుగు గంటల 16 నిమిషాల సేపు తుది సమరం జరిగింది. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన కొబోలి చివరి సెట్లో తడబడ్డాడు. ఈ సెట్లో జ్వెరెవ్ మూడుసార్లు కొబోలి సర్వీసును బ్రేక్ చేశాడు. 2020 యూఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2025 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ లో ఓడిపోయిన  జ్వెరెవ్ ను  ఈసారి మాత్రం విజయలక్ష్మి వరించింది. బోరిస్ బెకర్ తర్వాత గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ ప్లేయర్గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు.