ప్రధానిగా మోదీ రికార్డు 

Modi

ఇప్పటి  వరకు 4,399 రోజులు పాలించి.. జవహర్లాల్ నెహ్రూ రికార్డు అధిగమించారు  

భారత ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం ప్రధానిగా రికార్డు సృష్టించారు  ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన  2014 మే 26 నుంచి  నేటి వరకు 4,399 రోజులు ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మోదీ నిలిచారు. ఇది దేశ ప్రజల ప్రేమాభిమానాలకు నిలువెత్తు నిదర్శనం. మోదీ అంటే దేశానికి ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా. ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, బేటీ బచావో-బేటీ పడావో వంటి ప్రతిష్టాత్మక పథకాలతో దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ముందుకు నడుపుతున్న నిబద్ధత గలిగిన నాయకుడు మోదీ. 

ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రమూకల రక్తంతో భరతమాత నుదిటన తిలకం దిద్ది భారతదేశ సత్తాను దాయాది దేశానికి చాటిచెప్పిన ఘనత ప్రధాని మోదీ సొంతం. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ, ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందిస్తూ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ అన్ని రంగాల్లో దేశాన్ని ప్రపంచానికి పోటీగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైనది. ఆయన ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో దేశాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు నడపాలని బీజేపీ క్యాడర్ కోరుకుంటోంది . ఇప్పటి వరకు 4,398రోజులు(1952 మే 13 నుంచి  1964 మే 27వరకు) పనిచేసిన ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.