ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశా అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శనివారం ఉదయం బర్మ్ పార్క్, భవానిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశా, డైరెక్టర్ ఆయుష్ గోపాలకృష్ణ రోనంకి, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మిశా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా గత నాలుగు వారాలుగా నిర్వహిస్తున్నామని, ఒకవైపు యోగాంధ్రతో శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరోవైపు ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో నగరాన్ని పరిశుభ్రపరుస్తున్నామన్నారు. అందులో పారిశుద్ధ్య కార్మికులు, వారు కేవలం కార్మికులు మాత్రమే కాదు దైవికులతో సమానమన్నారు.
కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఈ వారం అంశం గార్బేజ్ వన్నెలబుల్ పాయింట్స్, పబ్లిక్ టాయిలెట్స్ అని అందులో భాగంగా నగరంలోని మరుగుదొడ్లు అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిశుభ్రంగా నిర్వహించుకోవటమే కాకుండా ప్రజలు కూడా తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను తరచుగా పరిశుభ్రపరచాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు.
డైరెక్టర్ ఆయుష్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను ఇతరత నగరాల్లో పనిచేశానని ఏ నగరం విజయవాడ అంతా పరిశుభ్రంగా లేదన్నారు. విజయవాడ నగరం కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒక నగరం మాత్రమే కాకుండా ఒక విదేశీ నగరంగా ఉందని అంత అందంగా, ఆహ్లాదంగా, పరిశుభ్రంగా, పచ్చని చెట్లతో ఉందని అన్నారు. నగరంలోని నది, మూడు కాలువలు ఉండటం ఎంత కష్టమో వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ పరిశుభ్రతకులో అత్యుత్తమ స్థానం నిలుపుకుంటుందన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలేకియా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు పడుతున్న కష్టం నగర పరిశుభ్రతలో కనిపిస్తుందని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో వాటిని నిర్వహించడం తాను గమనించారని, అందుకు విజయవాడ నగరపాలక సంస్థకు అభినందనలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడమే కాకుండా దగ్గరిలోని గార్బేజ్ వల్లరబుల్ పాయింట్ని తమ చేతులతో అక్కడున్న వ్యర్ధాలను తీసి పరిశుభ్రపరచటమే కాకుండా అందమైన రంగులు పూసి తరచుగా వ్యర్ధాలు పడే ప్రదేశాన్ని అందమైన ప్రదేశంగా మార్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, శకుంతల, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ హరీష్, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
