ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడైనని కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి సామాన్య ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు .
కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయస్థాయిలో ఫ్రంట్ ను అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారని యువ నేత లోకేష్ సైతం పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ పాత తరం నవతరం యువతరం అందరినీ సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని కొనియాడారు
త్వరలో వైసిపి చేపట్టబోయే వెన్నుపోటు కార్యక్రమాలపై మాజీ సీఎం జగన్ పై ఎంపీ చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి చెల్లిని జగన్ వెన్నుపోటు పొడిచారని బాబాయిని గొడ్డలి పోటు పొడిచాడని అందుకే వైసిపి గొడ్డలి పార్టీ అని వెన్నుపోటు దారులంతా ఆ పార్టీలోనే ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ కుటుంబ సభ్యులనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారన్నారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణ జాస్తి సాంబశివరావు చెన్నుపాటి గాంధీ చెన్నుపాటి ఉషారాణి నరసింహ చౌదరి సొంగ సంజయ్ వర్మ సంతోష్ కుమార్ చలసాని రమణ ప్రేమనాథ్ కోనేరు కిషోర్ బంక నాగమణి వ్యాస్ మాదిగని గురునాథం, టిడిపి నేతలు పాల్గొన్నారు
