దుర్గమ్మ అన్నదానానికి భారీ విరాళం

Annadanam Donation

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్య అన్నదానానికి గుంటూరు జిల్లా భక్తులు సోమవారం రూ.లక్ష విరాళం ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కె. శిరీష అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రి కి విచ్చేసారు. ఆలయ అధికారులను కలిసి రూ. 1,00,120 విరాళంగా అందజేశారు. దాతలను సత్కరించారు.

కాగా, వేసవి సెలవులు కావడంతో అమ్మవారిని దర్సించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ లెక్కచేయకుండా అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం భక్తులు విపరీతంగా వస్తున్నారు. దీంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు .  మరోపక్క భక్తుల తాకిడితో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఆలస్యం కలుగకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు సెలవులు పూర్తి కానుండడంతో అమ్మవారిని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.