పొట్టి క్రికెట్లో బుమ్రాకు చెత్త రికార్డు

Bumrah

ముంబై : భారత్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అత్యంత చెత్త రికార్డు మూట కట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో 13 మ్యాచ్లు ఆడి 49 ఓవర్లు వేసిన బుమ్రా 102.5 సగటున కేవలం 4 వికెట్లు మాత్రమే తీసాడు. ఓ టీ 20 టోర్నీ లో కనీసం 40 ఓవర్లు వేసిన బౌలర్లులో ఇదే అత్యంత చెత్త రికార్డు. ఇప్పటి వరకు ఏ బౌలర్ 100 మార్క్ (సగటు ) కూడా తాకలేదు. ఇలాంటి చెత్త ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.
బుమ్రా తర్వాత టీ 20 ఫార్మాట్లో (ఓ టోర్నీ సింగల్ ఎడిషన్ లో ) అత్యంత చెత్త సగటు (కనీసం 40 ఓవర్లు ) కలిగిన బౌలర్లు గా ప్రగ్యాన్ ఓజు ( ముంబై ఇండియన్స్ 95 సగటు ), ప్రసిద్ధ కృష్ణ (కేకేఆర్, 94.25), బెన్ని హోవెల్ ( చాట్టొగ్రామ్ చాలెంజర్స్, 86.25), మొహ్మద్ అమీర్ (కరాచీ కింగ్స్, 69.8) ఉన్నారు.