ప్రపంచ తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్!

musk

యూత్ ఏం  నేర్చుకోవాలి 

ప్రపంచ కుబేరుడు ఎలాన్   మస్క్ త్వరలోనే ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా (1 ట్రిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న వ్యక్తి) చరిత్ర సృష్టించబోతున్నాడు. ప్రస్తుతం 54 ఏళ్ల మస్క్ సంపద సుమారు 970 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదికలు చెప్తున్నాయి.  అంటే ట్రిలియన్ డాలర్ల మార్క్‌కు చాలా దగ్గరగా ఉన్నారు. రాబోయే స్పేస్ ఎక్స్ ఐపీఓ  విజయవంతమైతే మస్క్ అఫీషియల్ గా  ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలుస్తాడు. 1995లో తన మొదటి టెక్నాలజీ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి 31 ఏళ్లలో మస్క్ సంపద వేరే లెవెల్ లో పెరుగుతూ వచ్చింది.  లెక్కల ప్రకారం ఆయన ప్రతి సెకనుకు సుమారు 992 డాలర్లు, ప్రతి గంటకు దాదాపు 36 లక్షల డాలర్ల సంపదను సంపాదించినట్టే.

ఎలాన్ మస్క్ సంపద ఎక్కడ ఎంత అంటే 

స్పేస్‌ ఎక్స్  

మస్క్ సంపదలో అత్యధిక భాగం స్పేస్‌ఎక్స్‌లోని వాటాల రూపంలో ఉంది. దీని విలువ సుమారు 538 బిలియన్ డాలర్లు.

టెస్లా (Tesla)ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం  టెస్లా లోని  వాటాల విలువ సుమారు 167 బిలియన్ డాలర్లు.

స్టాక్ ఆప్షన్లు

టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల్లో కలిపి మరో 150 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్లు ఆయన దగ్గరున్నాయి. 

ఇతర కంపెనీలు

ది బోరింగ్ కంపెనీ , న్యూరా లింక్  సంస్థల్లోని వాటాల విలువ ఒక్కోటి సుమారు 5 బిలియన్ డాలర్లు.

ఇతర ఆస్తులు

విమానాలు, పెట్టుబడులు, ఇతర ఆస్తుల రూపంలో సుమారు 104 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు అంచనా.

ఈ డబ్బుతో ఏం కొనొచ్చు అంటే ..

970 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్   ఎన్నో అద్భుతమైనవి కొనొచ్చు. అంటే  అమెరికాలో  24 లక్షల ఇళ్లు కొనొచ్చు .  అత్యాధునిక గల్ఫ్‌స్ట్రీమ్ G700 ప్రైవేట్ జెట్లను 10,000 వరకు కొనొచ్చు అంతే కాదు , వాటి నిర్వహణ ఖర్చులను కూడా సంవత్సరాల పాటు భరించగలరు.అమెరికాలోని ప్రధాన క్రీడా జట్లు ఐన ఎన్ ఎఫ్ ఎల్ , ఎన్ బిఏ జట్లను  కొనొచ్చు ఐనా కూడా  వందల బిలియన్ డాలర్లు మిగులుతుంది.  అలాగే పెద్ద పెద్ద కంపెనీలైన ది హోమ్ డిపో, ఫెడ్ ఎక్స్,  టార్గెట్, యూపిఎస్  , స్టార్ బాక్స్, సివిఎస్ హెల్త్   వంటి భారీ సంస్థలను కొనుగోలు చేసే స్థాయి  సంపద ఆయన దగ్గర ఉంది .మస్క్ వ్యక్తిగత సంపద అమెరికా మొత్తం జీడీపీలో  3 శాతం వరకు సమానమని అంచనా.  ఆయన ఆస్తుల విలువ ప్రపంచంలోని 125 కంటే ఎక్కువ దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తిని మించిపోతుందని విశ్లేషకులు  చెబుతున్నారు. ఇందులో నార్వే, థాయిలాండ్, ఆర్జెంటినా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు కూడా ఉన్నాయి.

మస్క్ సక్సెస్ ఫార్ములా ఇది  

ఎలాన్ మస్క్ స్మార్ట్ గా హార్డ్ వర్క్ చేస్తారు సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత  కొనుగోలు చేసిన తర్వాత వారానికి 120 గంటలకు పైగా పని చేశానని ఆయన  చాల సందర్భాల్లో చెప్పారు . కొన్నిసార్లు ఇంటికి వెళ్లకుండా ఫ్యాక్టరీల్లోనే పడుకున్నట్లు కూడా చెప్పుకున్నారు. ఇంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఎందుకు రాదు యూత్ కూడా ఈ దిశగా హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ లో అనుకున్న గోల్ కొంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటూ విద్యా వేత్తలు చెప్తున్నారు.