చిన్న అలవాట్లు.. కర్మ భారం అధికం 

karma

కర్మ అంటే దేవుడు విధించే  శిక్ష కాదు. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులు, అలవాట్లు మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి . కొన్ని సార్లు మన ప్రవర్తనే మనకు తెలీకుండా కర్మ భారాన్ని పెంచుతాయి. అవేంటో చూద్దాం 

మనసు చెప్పేది వినకపోవడం: మనకు ఏది సరైనదో మన అంతరాత్మ ముందే చెబుతుంది. కానీ దాన్ని పట్టించుకోకుండా మనకు నచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాం.  జీవితం మళ్లీ మళ్లీ అదే పాఠాన్ని నేర్పుతుంది. కానీ ఎదో ఒక సందర్భంలో మనం మన మార్గాన్ని మార్చుకోకపోతే ఆ కర్మ భారం పెరుగుతూ వెళ్తుంది. 

ఆలోచించకుండా మాట్లాడటం: గాసిప్‌లు క్రియేట్ చేసి అందరికీ పదేపదే చెప్పడం , కోపంలో ఎదుటి వాళ్ళను  బాధపెట్టే మాటలు మాట్లాడటం, సరదా కోసం ఇతరులను గాయపరచడం కర్మపై ప్రభావం చూపుతుంది. మాటలకు శక్తి ఉంటుంది అన్న విషయాన్నీ మర్చిపోకూడదు. 

తీసుకోవడం మాత్రమే చేయడం: ఇతరుల నుంచి  సహాయం, ప్రేమ, సమయం తీసుకుంటూనే ఉంటారు కొందరు. వాటిని వారికి  తిరిగి ఇవ్వకపోవడం అంత మంచిది కాదు. అలాగే ఆహారం, నీరు వంటి వనరులను వృథా చేయడం కూడా కర్మ భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఏది తీసుకుంటామో దాన్ని ఒకటికి రెండింతలు వేసి తిరిగి ఇవ్వకపోతే మన అంతరాత్మ ఆ కార్మ భారాన్ని అనుభవించాల్సి వస్తుంది. 

భావాలను దాచిపెట్టడం: కోపం, బాధ, నిరాశ వంటి భావాలను ఎప్పుడూ అణచిపెడితే అవి తర్వాత సమయంలో  ఒత్తిడి, ఆందోళన, సంబంధాల్లో సమస్యలుగా బయటపడతాయి. ఎలాంటి ఎమోషన్ ని అయినా  వెంటనే బయటకు వెళ్లగక్కడం మంచిది 

మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం: ఏ పనైనా వాయిదా వేయడం పెద్ద నేరమే. చేస్తానని చెప్పి చెయ్యకపోవడం ఆ విషయాన్నే మర్చిపోవడం చెప్పిన పని చేయకపోతే అది మన పై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది. చిన్న మాట అయినా నిలబెట్టుకోవడం ముఖ్యం.

అసూయపడటం: ఇతరుల విజయం చూసి బాధపడటం మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. “వాళ్లకు ఎందుకు వచ్చింది?” అని కాకుండా “నేను ఏమి నేర్చుకోవచ్చు?” అని ఆలోచిస్తే అంతుకు మించిన సంతోషం మరొకటి ఉండదు .

భయంతో నిర్ణయాలు తీసుకోవడం : భయంతోనో కష్టముగా ఉంటుందో వచ్చిన అవకాశాలను  వదిలేయడం, ఎప్పుడూ సురక్షితమైన దారినే ఎంచుకోవడం మన ఎదుగుదలను ఆపేస్తుంది. భయం ఉన్నా ముందుకు అడుగు వేయాలి అప్పుడు అది మంచి కర్మాగా మారి మన కష్టానికి ప్రతిఫలం ఇస్తుంది. 

 కర్మ భారాన్ని  పెంచేవి  రోజువారీ జీవితంలో చేసే చిన్న అలవాట్లే.  మంచి ఆలోచనలు, మంచి మాటలు, నిజాయితీ, కృతజ్ఞతతో జీవిస్తే కర్మ కూడా తేలికవుతుంది, జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది.