VISAKHAPATNAM : ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు . విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో పట్టుబడిన సుమారు 20,876 కేజీల గంజాయిని, 23 కేజీల హాశిష్ ఆయిల్ ను పరవాడ పరిధిలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో ధ్వంసం చేసారు . ఈ సందర్బగా ఆమె మాట్లాడుతూ ASR జిల్లాలో గంజాయి సాగును పూర్తి అరికట్టామని తెలిపారు. గడచిన 18 నెలల కాలంలో ఐదు సార్లు గంజాయి ధ్వంసం చేశామని ,గంజాయి భారీన పడకుండా యువతను రక్షించుకోవడమే మా ధ్యేయమన్నారు .కొంతమంది యువత మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ,పిల్లలు ఏం చేస్తున్నారో వారు ప్రవర్తనపై కూడా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు .
ఈరోజు 20 వేల కేజీల పైగా గంజాయిని ధ్వంసం చేసామన్నారు. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న sp లు సమన్వయంతో పని చేస్తున్నారు. పోలీసులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తుండటంతో, గిరిజనులు ప్రత్యామ్నాయపంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు.
ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుందని ,మన ఈగల్ టీం యొక్క సూచనలు,సలహాలు ఒరిస్సా పోలీసులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలతో పాటు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీలు వివిధ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతున్నాముని .గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో IG గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
