KRISHNA: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హరనాథ్ మంగళవారం కృష్ణా మోపిదేవి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన హరనాధ్ కు పంచాయతీ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.
గతంలో తహసీల్దారుగా మోపిదేవిలో పనిచేసిన హరనాథ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెవిన్యూ సంబంధిత అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తూ, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో సామరస్యంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించేవారు.
మండల ప్రజలతో పాటు తోటి అధికారులు, నేతల అభిమానాన్ని చూరగొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మోపిదేవి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టినట్లు హరనాథ్ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో బొడ్డు శ్రీనివాసరావు, మోపిదేవి నాగేశ్వరరావు, నవీన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
