రియల్ హీరో సార్ధక్ సిద్ధాంత్
సోషల్ మీడియా రీల్స్, వీడియో గేమ్స్‌తో కాలక్షేపం చేసే జనరేషన్ అని నేటి యువతను అనుకుంటారు అయితే .. ఏకంగా పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టి, ఐఏఎస్ అధికారుల ముచ్చెమటలు పట్టించిన ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది!
17 ఏళ్ల కుర్రాడు… 30 మంది ఎంపీలు: పార్లమెంట్లో ఏం జరిగింది?
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం అది. లోపల దేశ విద్యా విధానాన్ని శాసించే 30 మందికి పైగా ఎంపీలతో కూడిన ‘పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ సమావేశమై ఉంది. వారికి ఎదురుగా దేశంలోనే అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారులు, సీబీఎస్ఈ చైర్మన్, సెక్రెటరీలు కూర్చొని ఉన్నారు.
అంతటి ప్రతిష్టాత్మకమైన మీటింగ్‌లోకి చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకుని ఒక 17 ఏళ్ల కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. అతనే సార్ధక్ సిద్ధాంత్. భయం అనేది ఎరుగకుండా, తాను సేకరించిన పక్కా ఆధారాలతో కూడిన 7 పేజీల డాక్యుమెంట్‌ను స్క్రీన్‌పై పెట్టి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ కుర్రాడు చెప్తున్న నిజాలు వింటుంటే ఎంపీలకే మైండ్ బ్లాక్ అయింది. ఎదురుగా కూర్చున్న విద్యాశాఖ అధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ముచ్చెమటలు పట్టాయి.
అసలు కథ ఎక్కడ మొదలైంది?
బోర్డు పరీక్షల్లో పేపర్ కరెక్షన్ తప్పులు జరగకుండా ఉండడానికి సీబీఎస్ఈ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదే OSM (On-Screen Marking). అంటే విద్యార్థుల ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో కరెక్షన్ చేయడం.
ఈ సిస్టమ్ వల్ల ఒకరి పేపర్ మరొకరి అకౌంట్ లోకి వెళ్లడం, విపరీతంగా మార్కులు తారుమారు అవ్వడం మొదలైంది. బాధితులైన విద్యార్థులు సోషల్ మీడియాలో ఆధారాలు పెట్టడం చూసి ఒక 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ దీనిపై రీసెర్చ్ చేశాడు. ఆ సాఫ్ట్‌వేర్‌లో కనీసం సైబర్ సెక్యూరిటీ లేదని, కేవలం ఒకే ఒక్క ‘మాస్టర్ పాస్ వర్డ్’ తో ఎవరి మార్కులనైనా మార్చేయవచ్చనే భయంకరమైన బగ్‌ను కనిపెట్టాడు.
ఇంతటి ఘోరమైన సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడానికి, సీబీఎస్ఈ లాంటి సంస్థ ఒక ప్రైవేట్ కంపెనీకి టెండర్ ఎలా ఇచ్చిందనే డౌట్ సార్ధక్ సిద్ధాంత్‌కు వచ్చింది. ఆ ఒక్క డౌటే దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్కామ్‌ను బయటపెట్టింది.
హైదరాబాద్ కంపెనీ.. భయంకర నిజం
సార్ధక్ నేరుగా ‘సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్’ ఓపెన్ చేసి, సీబీఎస్ఈ టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసి అనువణువూ చదివాడు. ఈ టెండర్ దక్కించుకున్న కంపెనీ పేరు కోఎంట్ ఎడ్యూటెక్ (Coempt Edutext). ఇది హైదరాబాద్‌కు చెందిన కంపెనీ. దీని హిస్టరీ తవ్వితే భయంకరమైన నిజం బయటపడింది.
హిస్టరీ లీక్: ఈ కోఎంట్ కంపెనీ పాత పేరే గ్లోబరీనా (Globarena). 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల రిజల్ట్స్ ప్రాసెస్ చేసింది. ఈ కంపెనీయే. అప్పట్లో వీరి సాఫ్ట్వేర్ బ్లండర్స్వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దానికి మనస్థాపం చెంది ఏకంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ప్రభుత్వం ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
రూల్స్ మానిప్యులేషన్: ఒక కంపెనీ కోసం 3 సార్లు మార్పులు!
పిల్లల ప్రాణాలు తీసి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫ్రాడ్ కంపెనీ, పేరు మార్చుకుని రాగానే సీబీఎస్ఈ అధికారులు వందల కోట్ల టెండర్ ఎలా ఇచ్చారు? ఇక్కడే సీబీఎస్ఈ లోపల ఉన్న కొందరు పెద్దల భాగవతాన్ని సార్ధక్ ఎక్సెల్ షీట్ సాక్షిగా బట్టబయలు చేశాడు. ఆ కంపెనీకి మాత్రమే టెండర్ దక్కేలా సీబీఎస్ఈ తన సొంత రూల్స్‌ను ఏకంగా 3 సార్లు మార్చేసింది:
ట్విస్ట్ 1 (బ్లాక్‌లిస్ట్ రూల్ మార్పు): పాత నిబంధనల ప్రకారం ‘గతంలో ఎప్పుడైనా బ్లాక్‌లిస్ట్ అయిన వారికి టెండర్ ఇవ్వకూడదు’. కానీ ఈ కంపెనీ కోసం ‘ప్రస్తుతం (ప్రస్తుత తేదీకి) బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వకూడదు’ అని మార్చారు.
ట్విస్ట్ 2 (అనుభవంలో మినహాయింపు): టెండర్ రావాలంటే గతంలో ‘బోర్డ్ ఎగ్జామ్స్’ ప్రాసెస్ చేసిన అనుభవం ఉండాలి. కోఎంట్కు అది లేదు ‘యూనివర్సిటీ ఎగ్జామ్స్ చేసిన అనుభవం ఉన్నా చాలు’ అని రూల్ మార్చేశారు.
ట్విస్ట్ 3 (ఐటీ దిగ్గజాలకు చెక్): దేశంలోని ఇతర పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఈ టెండర్ రేస్‌లోకి రాకుండా ఉండడం కోసం క్వాలిఫికేషన్ నిబంధనలను తమకు నచ్చినట్లు సవరించారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 రకాల టెండర్ అక్రమాలను (Irregularities) ఆ 17 ఏళ్ల కుర్రాడు ఆధారాలతో సహా నిరూపించాడు.
వ్యవస్థ లొంగింది… కుర్రాడు గెలిచాడు!
జాతీయ మీడియాలో ఈ వార్త హైలైట్ అవ్వడంతో, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సార్ధక్‌ను విచారణకు పిలిచింది. ఒక ఐఏఎస్ అధికారి కూడా గుర్తించలేని లూప్‌హోల్స్‌ను, ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు లాజికల్‌గా బద్దలు కొట్టడం చూసి పార్లమెంట్ ప్యానెల్ అవాక్కయింది.
ఫలితంగా… సీబీఎస్ఈ దిగిరాక తప్పలేదు. ఆ వివాదాస్పద కోఎంట్ ఎడ్యూటెక్ కంపెనీతో చేసుకున్న వందల కోట్ల అగ్రిమెంట్‌ను సీబీఎస్ఈ తక్షణమే క్యాన్సిల్ చేసుకుంది.
ఇది నేటి యువత పవర్!
ప్రస్తుతం సార్ధక్ సిద్ధాంత్‌ను రాజకీయ నాయకులు, మేధావులు ‘టెండర్ ఇన్వెస్టిగేటర్’ అని ప్రశంసిస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం చేయలేని పనిని, కేవలం ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా పవర్‌తో ఈ కుర్రాడు చేసి చూపించాడు.
విద్యా వ్యవస్థ అనేది వ్యాపారం కాదు, అది కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు. కమిషన్ల కోసం ఆ భవిష్యత్తును ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి ఆడుకోవాలని చూసిన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కదిలించిన 17 ఏళ్ల సార్ధక్ సిద్ధాంత్ నిజంగా రియల్ హీరో.
