విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు ప్రతిపాదనలను పరిశిలించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం విజ్జేశ్వరంలో పర్యటించారు. విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు మూడు మండలాలు, 33 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు అవసరాన్ని ఇటీవల మంత్రి కందుల దుర్గేష్  ఉప ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకురాగా రోడ్డు వేయాల్సిన ప్రాంతాన్ని ఈరోజు అయన స్వయంగా పరిశీలించారు.
విజ్వేశ్వరం, పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, ఉసురుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం, కడింపాడు, దొంగరావిపాలెం తదితర గ్రామాలను కలుపుతూ నిర్మించాలని కోరుతున్న ఈ రోడ్డు వల్ల వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు రవాణా మార్గం సులువు అవుతుందనీ, వరద కాలంలో గట్టు పర్యవేక్షణ ఈ రోడ్డు వల్ల సులభమవుతుందని వివరించారు.
ఆ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఈ రోడ్డు నిర్మాణంపై ఒక నివేదిక ఇవ్వాలని, ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ పర్యటనలో  మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

Pawan Kalyan
విజ్జేశ్వరం – సిద్ధాంతం రోడ్డును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్