- బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించే ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 కూడా ప్రారంభం కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అగ్నిపరీక్షకు సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం.
ఈసారి అగ్నిపరీక్షకు భారీగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. వేలాది మంది అప్లై చేసుకోగా.. వారిలో నుంచి 70 మందిని ఎంపిక చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారట. ఆ 70 మందిలో చివరకు 15 మందిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ 15 మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆ 15 మంది వీళ్లేనా?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, శ్రష్ఠి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగీ తుళ్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, మిస్ అపూర్వ అగ్నిపరీక్ష సీజన్ 2లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేర్లపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి వీరే ఫైనల్‌గా ఎంపికైన 15 మంది అని ఇప్పుడే చెప్పలేం. షో ప్రసారం ప్రారంభమైన తర్వాతే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆదిరెడ్డి హింట్స్‌తో మరింత ఆసక్తి
మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9లోని కామనర్స్ కూడా అగ్నిపరీక్ష 2లోకి రానున్నారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వారంతా ఒకేసారి కాకుండా.. ఒక్కొక్కరు ఒక్కో ఎపిసోడ్‌లో కనిపించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
అంతేకాదు.. కళ్యాణ్ పడాల, కళ్యాణ్, మనీష్ వంటి వారు అగ్నిపరీక్ష కంటెస్టెంట్లకు టాస్కులు కూడా పెట్టినట్లు ఆదిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈసారి అగ్నిపరీక్షలో కేవలం సెలక్షన్స్ మాత్రమే కాకుండా టాస్కులు, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక భాగీ అనే కంటెస్టెంట్ చాలా ఫన్నీగా ఉంటుందని కూడా ఆదిరెడ్డి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైరల్ అవుతున్న 15 మంది లిస్ట్‌పై ఆసక్తి పెరిగింది. వీరిలో ఎవరు తమ ఆటతో ఆకట్టుకుంటారు? ఎవరు బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెడతారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 10కు ముందు ‘అగ్నిపరీక్ష సీజన్ 2’తోనే అసలు సందడి మొదలు కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రారంభం కానుండటంతో.. కామన్ కంటెస్టెంట్ల జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.
